కరోనా వైరస్ కారణంగా భారత క్రికెటర్లకు ఇక క్వారైంటైన్ తప్పదా…? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆస్ట్రేలియా పర్యటను భారత జట్టు వెళ్లాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పట్లో క్రికెట్ ఆడే పరిస్థితి లేనందున .. కొత్త షెడ్యూల్ అక్టోబర్ నుండే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అయితే… ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ తో పాటు 4 టెస్టులు ఆడనున్నారు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ కూడా ఉంది. దీంతో ఈ పర్యటనకు వెళ్లాలంటే భారత జట్టు ముందుగానే అక్కడకు చేరుకొని, 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేసన్ లో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ కూడా దృవీకరించింది.
ఇక ఐపీఎల్ లేకపోతే ఈ సంవత్సరం బీసీసీఐకి 4వేల కోట్ల ఆదాయం పోతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించాడు. ఇప్పటికైతే ఐపీఎల్ వాయిదా పడింది, కానీ ఉంటుందో ఉండదో తెలియదు అని ప్రకటించాడు. ఇక భారత క్రికెట్ ప్లేయర్స్ అంతా ఆటకు దూరంగా ఉండటంతో వారి జీతాల్లో కోత ఉంటుందన్న వార్తలపై కూడా గంగూలీ స్పందించాడు. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని, కానీ బోర్డుకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందన్నాడు. దీంతో భవిష్యత్ లో ఆట సాగకపోతే కోతలుంటాయా…..? అన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది.