ప్రవాస భారతీయులే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని ప్రధాని మోడీ అన్నారు. దేశ బ్రాండ్ అంబాసిడర్లుగా వారి పాత్ర విభిన్నమైనదని ఆయన తెలిపారు.17వ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సును ఇండోర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా, యోగా, హ్యండీ క్రాఫ్ట్ ఇండస్ట్రీ, చిరుధాన్యాలకు ప్రవాసీలే అంబాసిడర్లని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై భారత్ తన వాణిని వినిపిస్తోందన్నారు. ఈ ఏడాది జీ20కి భారత్ హోస్ట్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. దీన్ని ప్రజల భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమంగా మార్చాలని ఆయన కోరారు. భారత్ కేవలం జ్ఞానానికి మాత్రమే కేంద్రంగా ఉండదని, నైపుణ్యానికి కూడా రాజధానిగా మారనుందని ఆయన వెల్లడించారు.
భారత్ వేగంపై ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. ప్రపంచంలోని 40 శాతం రియల్ టైం ట్రాన్సాక్షన్లు భారత్‌లోనే జరగడం చాలా ఆసక్తికరంగా ఉందని ఆయన అన్నారు. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రవాసీ భారతి దివాసీ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.
మరోవైపు ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై అత్యంత నమ్మకమైన భాగస్వామిగా భారత్ ఉందని ప్రత్యేక అతిథిగా హాజరైన రిపబ్లిక్ ఆఫ్ సురినేమ్ అధ్యక్షుడు చంద్రికపెర్షద్ సంతోఖి పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.