ఉక్రెయిన్ లో ఇప్పటికీ అక్కడే చిక్కుకుని ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ ఓ గూగుల్ డాక్యుమెంట్ ను జతచేసింది.

‘ ఇంకా ఇప్పటికీ ఉక్రెయిన్ లోనే ఉన్న భారతీయులు తమ వివరాలను అత్యవసర ప్రాతిపదికన ఎంబసీ అటాచ్ చేసిన గూగుల్ డాక్యుమెంట్ లో పూరించాలి” అని తెలిపింది.
ఆపరేషన్ గంగా తుది దశకు చేరుకుంది. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి చివరి విమానం ఆదివారం వెళ్లనున్నట్టు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.