బ్రిస్భెన్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచులో ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగులకే అలౌట్ అయ్యింది. అయితే, ఈ మ్యాచులో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనపర్చాడు. హైదరాబాద్ నుండి జాతీయ జట్టుకు ఎంపికైన సిరాజ్ ఐదు వికెట్లు తీసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
మూడు టెస్టుల్లో కలిపి ఏకంగా 13వికెట్లు తీసుకొని ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా మారాడు. ఇక పేస్ బౌలర్ల స్వర్గధామంగా ఉండే బ్రిస్భెన్ గబ్బా పిచ్ పై ఒకే మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
గబ్బా పిచ్ పై ఒకే మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
ఎరపల్లి ప్రసన్న – 6/104 in 1968
బిషన్ సింగ్ బేడీ – 5/57 in 1977
మదన్ లాల్ – 5/72 in 1977
జహీర్ ఖాన్ – 5/95 in 2003
మహ్మద్ సిరాజ్ – 5/73 in 2021