కరోనా పై అవగాహన కోసమే ఈ ఫన్నీ షార్ట్ ఫిల్మ్
ఇంటికే పరిమితం కావాలని పిలుపు
కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేలా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్, వివిధ భాషల్లోని సూపర్ స్టార్ లను భాగం చేస్తూ నిర్మించిన ‘ఫ్యామిలీ’ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలన్న సందేశాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పారు.
అసలు కథేంటి??
ఈ షార్ట్ ఫిల్మ్ లో అమితాబ్,రజనీకాంత్,చిరంజీవి,మోహన్ లాల్,ప్రియాంకా చోప్రాలు కనిపిస్తారు. వీరితో పాటు ఈ షార్ట్ ఫిల్మ్ లో మమ్ముట్టి, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రసేన్ జిత్ ఛటర్జీ, శివరాజ్ కుమార్, సోనాలీ కులకర్ణి, దల్జిత్ దోస్నాజ్ నటించారు.ప్రతీ డైలాగ్ వారి మాతృ భాషలోనే ఉంటుంది.ఇక కథ విషయానికి వస్తే, అమితాబ్ తన సన్ గ్లాసెస్ పోగొట్టుకుంటారు.వాటిని వెతికే పనిలో షార్ట్ ఫిల్మ్ నడుస్తుంది. పలు భాషలకు చెందిన నటీ నటులు ఆ గ్లాసెస్ కోసం ప్రయత్నించడం చివరకు సన్ గ్లాసెస్ దొరకడం, ఆపై అమితాబ్ ఇచ్చే చిన్న సందేశంతో ముగుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ను చిత్రీకరించేందుకు ఇందులో నటించిన నటీనటులు ఎవరూ తమతమ ఇళ్ల నుంచి కదల్లేదని, ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలని అమితాబ్ సందేశాన్ని ఇచ్చారు.
అదరగొట్టిన చిరంజీవి
ఈ షార్ట్ ఫిల్మ్ లో చిరంజీవి తెలుగు లో డైలాగ్ చెప్తాడు.షేవింగ్ చేసుకుంటున్న చిరంజీవిని మనం ఈ సీన్ లో చూడొచ్చు.
మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటున్నారా? అయితే కింది వీడియోలో చూడండి.