భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు 20లక్షల ఆర్థిక ప్యాకేజిని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్రమోడీ. అయితే ఓవైపు ఆర్థిక వ్యవస్థను ప్రకటిస్తూనే… భారత్ తన కాళ్లపై తను నిలబడాలని, నాణ్యమైన ఉత్పత్తులను చేస్తూ 21శతాబ్ధంలో నిలబడబోతుందని ప్రకటించారు.
భారత ప్రధాని మాటలను బట్టి చైనాకు చెక్ పెట్టాలన్న ఉద్దేశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరు తమపై తాము మాత్రమే ఆధారపడుతూ… భారత్ ను ఇతరులపై ఆధారపడకుండా చేయలనే ఉద్దేశం అదే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారత ఆర్థిక ప్యాకేజీ కూడా అన్ని వర్గాలకు అని చెబుతూనే, మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని ఒకటికి రెండు సార్లు నొక్కి చెప్పటం వెనుక భారత తయారీ రంగం కొత్త పుంతలు తొక్కాలని కోరటం కనపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
చైనాకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే, ఇతర దేశాల నుండి తయారీ రంగం భారత్ కు వచ్చే విధంగానే ఈ ప్యాకేజీ వివరాలు ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.