75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారత్ – పాకిస్తాన్ బార్డర్ అట్టారీ మూడు రంగుల్లో మెరిసిపోయింది. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ పేరుతో ఈసారి వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహించింది.
అట్టారీ ప్రాంతమంతా విద్యుత్ వెలుగుల్లో, త్రివర్ణ కాంతులతో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారత్ మాతాకి జై అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఎంతో అందంగా ఉంది… జై హింద్ అని రాసుకొచ్చారు.