ఇరాక్ లోని భారతీయులకు భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాక్ లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఇరాకు ప్రయాణాలు మానుకోవాలని…ఇరాక్ లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని హెచ్చరించింది.
గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ 15 మధ్యంతర క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు హతమైనట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికా మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని…నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.