రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాల విషయంలో ట్విట్టర్ తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. రైతు నాయకుల ట్విట్టర్ ఖాతాలు నిలుపుదల చేయాలన్న తమ ఆదేశాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ… ట్విట్టర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
మొదట రైతుల ఆందోళన నేపథ్యంలో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పలు ఖాతాలను ట్విట్టర్ అధికారులు నిలిపివేశారు. అయితే, ఖాతాల పునరుద్ధరణ అంశంపై కేంద్రాన్ని సంప్రదించకుండానే పునరుద్ధరించటంపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. తమ నోటీసులు అందకముందే పునరుద్దరించటంపై నోటీసులిచ్చింది.