కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగంతో పాటు ఉద్యోగులు, వృద్దులు, వికలాంగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. దీంతో కేంద్రం కరోనా లాక్ డౌన్ తర్వాత రిలీఫ్ ఫండ్ ప్రకటించింది.
కేంద్రం ప్రకటించిన కరోనా రిలీఫ్ ఫండ్ హైలెట్స్ ఇవే…
1. వచ్చే మూడు నెలలు ఉచిత రేషన్
అదనంగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఉచితం
2. 8కోట్ల ఉజ్వల లబ్ధి దారులకు మూడు నెలలు ఉచితంగా గ్యాస్
3. లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
4. పేదలకు నగదు బదిలీ
5. ఉపాధి హామీ కూలీలకు 2 వేలు అదనం
6. వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
7.8.7 కోట్ల మంది రైతులకు నెలకు 2వేలు
8. వితంతువులు, పేదలు, రైతుల ఖతాల్లోకి నేరుగా నగదు
9. మహిళా జన్ దన్ ఖాతాదారులకు నెలకు 500 , మూడు నెలల పాటు
10. కరోనా తో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికుల కు మూడు నెలల పాటు 50 లక్షల ఇన్సూరెన్స్
11. డ్వాక్రా గ్రూపులకు 20లక్షల వరకు లోన్
మొత్తంగా లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.