టిక్ టాక్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదేమో. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారే. కొందరు కాలక్షేపం కోసం, కొందరు సరదగా చిన్న చిన్న వీడియోలు తీసిపెడుతుంటారు. మరికొందరు సరదగా టిక్ టాక్ చూస్తూ టైం పాస్ చేస్తారు.
కానీ ఈ ముసుగులో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ భారత ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కు అనేక ఫిర్యాదులు అందాయి. గతంలో దేశంలో పోర్న్ సైట్స్ నిషేధించే సమయంలో తాత్కాలికంగా భారత ప్రభుత్వం టిక్ టాక్ ను నిషేధించగా, ఇప్పుడు మరోసారి మహిళా కమిషన్ సూచనతో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే, కరోనా వైరస్ విషయంలో చైనాపై ప్రపంచ దేశాలు అనుమానంగా చూస్తున్నాయి. దీంతో కొన్ని దేశాలు, కంపెనీలు తమ తయారీ పరిశ్రమలను అక్కడ నుండి తరలిస్తుండగా… చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరించాలన్న వాదన కూడా ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు చెందిన టిక్ టాక్ బ్యాన్ చేయటం ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ ను 2012లో చైనాకు చెందిన బైట్ డాన్స్ అనే కంపెనీ తయారు చేసింది.
టిక్ టాక్ పై చాలా దేశాల్లో ఇప్పటికే నిషేధం కూడా ఉంది.