కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిన ప్రభుత్వం మంగళవారం నుంచి డొమెస్టిక్ ప్లయిట్స్ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. విమానయాన సంస్థలు తమ ఫ్లయిట్స్ మంగళవారం రాత్రి 11.59 నిమిషాల వరకు వాటి గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కార్గో విమానాలు మాత్రం యధావిధిగా నడుస్తాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 415 కు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీకి, ఇతర ప్రాంతాలకు విమానాలను అనుమతించొద్దని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కేంద్రాని విజ్ఙప్తి చేయగా కేంద్రం ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పైగా డొమెస్టిక్ ఫ్లయిట్స్ లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ప్రకటించారు. తమ రాష్ట్రంలోకి విమానాలను అనుమతించ వద్దని సోమవారు ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రికి లేఖ రాశారు.