ఏపీ సీఎం జగన్ ను కలిశారు ప్రముఖ హాకీ క్రీడాకారిణి రజనీ. టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబరిచినందుకు ఆమెను అభినందించారు. శాలువాతో సత్కరించారు జగన్.
రజనీకి రూ.25 లక్షల నగదుతోపాటు.. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. తిరుపతిలో వెయ్యి గజాల స్థలంతోపాటు నెలకు రూ.40 వేల చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పారు. అలాగే ఆమెకు గతంలో ప్రకటించిన రివార్డులు ఏమన్నా పెండింగ్ లో ఉంటే వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. రజనీ స్వస్థలం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం.