ఇండియన్ నేవిలో ఉద్యోగాల భర్తీ మొదలైంది. జస్ట్ టెన్త్ పాసయితే చాలు… మీరు కూడా అర్హులే. అక్టోబర్2020 బ్యాచ్‌కు చెందిన సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ నేవీ.
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాతపరీక్షలో ఎంపికైన వారిని ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆ తర్వాతే మెడికల్, ఫిటినెస్ టెస్ట్‌లుంటాయి. ఈ పరీక్షల ఆధారంగానే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.
ఏపీ, తెలంగాణలో ఈ నోటిఫికేషన్ తో టెన్త్ పాసయి… ఉద్యోగాన్వేషణలో ఉన్నవారంతా ఇక ఉద్యోగానికి సన్నద్ధం కాబోతున్నారు.