పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికాదళం ఆరేబియాసముద్రంలో నిర్వహించిన ఈ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. కోల్ కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఈ పరీక్షకు వేదిక అయింది.
సముద్ర తలం నుంచి గగనతలం లోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్ ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది.
ఆత్మ నిర్భర్ కార్య్రక్రమంలో భాగంగా మిసైల్స్ లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్ ఏరో స్పేస్ నిరంతరాయంగా కృషి చేస్తోందని భారత నేవీ అధికారులు తెలిపారు
కోల్ కతా లోని మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్ నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ ని ప్రయోగించారు. సీకర్, బూస్టర్ తో కూడిన ఈ క్షిపణి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందని నేవీ అధికారులు చెప్పారు. గత నెలలో ఇండియన్ నేవీ పైలట్లు ఐసీఏ తేజాస్, మిగ్-29 విమానాలను ఐఎన్ ఎస్ విక్రాంత్ నౌక పై లాండింగ్ చేయించగలిగారు.