ఇండియన్ నేవీకి చెందిన టూ సీటర్ ఎయిర్ క్రాప్ట్ ఒకటి గోవాలో కుప్పకూలింది. రోజువారీ విధుల్లో భాగంగా గోవాలోని డబోలిమ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్ 29కె కొద్ది సేపటికే మర్గావో కు సమీపంలో కుప్పకూలింది. ఎయిర్ క్రాప్ట్ లోని రెండు ఇంజన్లకు మంటలంటుకోవడాన్ని గమనించిన ఇద్దరు పైలట్లు కెప్టెన్ షేక్ హ్యాండ్, లెఫ్టినెంట్ కేడర్ దీపక్ యాదవ్ పారాచూట్ సహాయంతో సురక్షితంగా కిందకు దూకారు. పక్షుల గుంపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. జనసంచారం లేని ప్రాంతంలో మిగ్ కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఘటనపై నేవీ అధికారులు విచారణకు ఆదేశించారు.