బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. కన్సర్వేటివ్, లేబర్ పార్టీలు రెండింటిలోనూ భారతీయ సంతతకి చెందిన వారున్నారు. గగన్ మొహింద్రా, క్లెయిర్ క్యుటిన్హో, నువేంద్ర మిశ్రా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషీ సునక్ తో పాటు దాదాపు డజన్ మంది భారతీయ సంతతకి చెందిన వారు ఎన్నికల్లో విజయం సాధించారు. రిషీ సునక్ 36,693 ఓట్లు సాధించారు. మొట్ట మొదటి సిక్కు మహిళ ఎంపీగా చరిత్ర సృష్టించిన ప్రీతి కౌర్ గిల్ ఈసారి కూడా బర్మింగ్ హామ్ ఎడ్గబేషన్ నుంచి 21,217 ఓట్లతో గెలుపొందింది. బ్రిటన్ పార్లమెంట్ లో తలపాగా చుట్టుకునే మొట్ట మొదటి సిక్కు ఎంపీ తర్మన్ సింగ్ దేశాయ్ ఈసారి కూడా తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.