అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీ ఈ మ్యాచ్ ను వీక్షించనున్నారు. గంటన్నర పాటు స్టేడియంలోనే ఉండి ఇరు దేశాల ఆటగాళ్లతో సమావేశమయ్యారు.
టాస్ గెలిచిన అనంతరం స్టేడియంలో జాతీయ గీతం ప్రారంభం కాగానే ఇరు దేశాల నేతలు ఆటగాళ్లతో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. ప్రధాని మోదీని ఆటగాళ్లకు కెప్టెన్ రోహిత్ శర్మ పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, అల్బనీస్ తమ జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లకు టెస్టు క్యాప్ లను అందజేశారు.
తర్వాత ఇద్దరు ప్రధానులు పీఎం ఫ్రెండ్ షిప్ హాల్ ఆఫ్ ఫేమ్ కు వెళ్లారు. అక్కడ రవిశాస్త్రి వారిద్దరికీ స్వాగతం పలికి హాల్ ఆఫ్ ఫేమ్, ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర గురించి వివరించారు. తర్వాత ఇద్దరు ప్రధానులు మైదానానికి చేరుకుని మైదానం చుట్టూ తిరుగుతూ ప్రజల పలకరించారు.
నేటితో భారత్, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ స్నేహానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇలా ప్రత్యక్షమయ్యారు. వాస్తవానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం గుజరాత్ చేరుకున్నారు. తొలి రోజు గుజరాత్ లో హోలీ ఆడిన ఆయన రెండో రోజు మ్యాచ్ ను ఆస్వాదించారు.