ఇండియన్ రైల్వే అమెరికా, చైనా, రష్యా తర్వాత 4వ స్థానంలో ఉంది. ఇండియాలో ఫస్ట్ రైల్ 1853 ఎప్రిల్ 16 న ముంబాయ్ బోర్ బందర్ స్టేషన్ నుండి ఠానా లోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ వరకు నడపబడింది. స్టీమ్ ఇంజిన్ తో నడిపిన ఈ రైలులో 400 యాత్రికులు 34 కిలోమీటర్లు ప్రయాణించారు.
- అతిపురాతన స్టీమ్ ఇంజిన్ రైలు మాత్రం డార్జిలింగ్ లో నడపబడింది. దీన్ని 1855లో టిక్సన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఇప్పటికీ ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులు ఈ ట్రైన్ లో ప్రయాణించడానికి వస్తారు.
- 1909 లో మొదటి సారిగా రైల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.
- ఫస్ట్ హైస్పీడ్ ట్రైన్ 1988 లో ఢిల్లీ నుండి భోపాల్ కు నడపబడింది. దీని స్పీడ్ గంటకు 150.
- ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతన చీనాబ్ నదిపై నిర్మించారు. దీని ఎత్తు ఈపిల్ టవర్ కంటే ఎక్కువ
- 1లక్షా15వేల కిలోమీటర్లకు పైన ఇండియాలో రైల్వే ట్రాక్ ఉంది.
- ఇండియన్ రైల్వే ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుతుంది.
- ఇండియాలో దాదాపు 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
- డిల్లీలో గల రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ కు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
- గోరఖ్ పూర్ రైల్వే ప్లాట్ పామ్ పొడవు 1366.33 మీటర్లు. ఇదో రికార్డ్!