సంక్రాంతి పండుగ ముందే ప్రయాణికులకు రైల్వే షాకివ్వబోతుంది. రైలు చార్జీలను భారీగా పెంచాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. అన్ని రైళ్లు, తరగతుల వారీగా ప్రయాణికుల చార్జీలను పెంచబోతున్నారు. ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని ఓ హిందీ పత్రిక కథనం ప్రచురించింది. ఓ వైపు ఆర్థిక మందగమనం ప్రభావంతో రైల్వేల ఆర్థిక వనరుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఒత్తిడి అధికంగా ఉంది.
రైల్వే గత రెండు సంవత్సరాలుగా చార్జీలను నేరుగా పెంచలేదు. కానీ ఈసారి రైల్వే చార్జీల పెంపు తప్పనిసరని, ఇప్పటికే ఫైల్ సిద్ధమయి ప్రధాని మోడీ ఆమోదం కూడా పొందిందని తెలుస్తోంది.