సంక్రాంతి వచ్చేస్తుంది. కుటుంబంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ఉత్సాహాంగా ఉంటారు. కానీ సంక్రాంతి ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. అందుకే ఆ రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో కాకినాడ టౌన్ నుంచి విజయవాడ మీదుగా లింగంపల్లి వరకు మొత్తం 26 ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను నడపనున్నారు. ట్రైన్ నెంబర్ 02775 పేరుతో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి లింగంపల్లికి ఉదయం 7.30కు చేరుతుంది. మొత్తం ఏర్పాటు చేసిన 26 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు జనవరి 1, 3, 6 , 8, 10, 13, 15, 20, 22, 24 , 27, 29 , 31 తేదీల్లో నడుస్తాయి.
Advertisements
ఆ తరువాత తేదీల్లో లింగంపల్లి నుంచి ఇదే రైలు ట్రైన్ నెంబర్ 02776 పేరుతో జనవరి 2, 4, 7, 9, 14, 16, 18, 21, 23, 25, 28, 30, ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణమవుతుంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి.
నూతన సంవత్సరం దృష్ట్యా విజయవాడ మీదుగా హబీబ్‌గంజ్ – చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. డిసెంబరు 31 వ తేదీన ఉదయం 10.25 గంటలకు హబీబ్‌గంజ్ నుంచి బయలు దేరుతుంది. మరుసటి రోజున ఉదయం 10.10 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఇటర్సీ, ఆమ్లా, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రపూర్, బలార్ష, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట స్టేషన్లలో ఆగుతుంది.