మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం… లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు, 15 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే జూన్ 1 నుండి తన సేవలను పునరుద్దరించనుంది. దశల వారీగా సేవలను పున ప్రారంభిస్తామని రైల్వే ప్రకటించింది.
ఈ ఉదయం 10గంటల నుండే రైల్వే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఆన్ లైన్ లో ఐ.ఆర్.సి.టీ.సి వెబ్ సైట్ నుండి రైల్వే టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే… టికెట్ కన్ఫమ్ అయిన ప్రయాణికులు మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారని, ప్రయాణికులు గంటన్నర ముందే అంటే 90నిమిషాల ముందే స్టేషన్ కు చేరుకోవాలని రైల్వే సూచించింది. ఇక మాస్కులు, స్టేషన్, ప్రయాణ సమయంలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఇక స్టేషన్లలో బుక్ షాపులు, రిఫ్రేష్మెంట్ షాపులతో పాటు టేక్ అవే తినుబండరాలకు, రెస్టారెంట్లకు అనుమతిచ్చింది.