కరోనా వైరస్ కారణంగా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. మొదటి వేవ్ సమయంలో కాస్త ఎక్కువగా భయపెట్టినప్పటికీ.. పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. కానీ.. రెండవ వేవ్ డెల్టా వేరియంట్ రూపంలో లక్షల ప్రాణాలను కభళించింది. అందులో నుండి కాస్త తేరుకుంటున్న సమయంలో థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. మాయదారి కరోనాను అరికట్టేందుకు కొవిడ్ టీకాలను అందజేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా మరో కొవిడ్ టీకాను అందుబాటులోకి తీపుకొచ్చారు భారత శాస్త్ర వెత్తలు.
ఇది కరోనా వైరస్ లోని అన్ని వేరియంట్లకు ఇక ఒకే ఒక్క టీకాతో చెక్ పెడుతోందని చెప్తున్నారు శాస్త్రవెత్తలు. ఈ టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం గర్వకారణం అంటున్నారు నిపుణులు. పశ్చిమ బెంగాల్ లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాకు.. అభిఎస్‌సీవో వ్యాక్ అని పేరు పెట్టారు.
ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2తో పాటు.. ఆ తరగతికి చెందిన ఆరు రకాల వైరస్ లను ఇది సమర్థవంతంగా ఎదురుకోగలుగుతోందని చెప్తున్నారు. కరోనాలోని అన్ని వైరస్ ల పైనా పనిచేసే ఏకైక టీకా ప్రపంచంలో ఇదొక్కటేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇప్పటికే కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ వంద శాతం రెండు డోసుల టీకాను అందించేందుకు చర్యలు చేపట్టింది.