ఐఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఇండియన్ షూటర్లు సత్తా చాటారు. మెగా టోర్నీలో ఇండియాకు ఐదో బంగారు పతకాన్ని అందించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ , కిరణ్ అంకుష్ జాదవ్, అర్జున్‌తో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల్లో 16-10తో చైనాను ఓడించి పసిడి పతకం గెలుచుకుంది.
రుద్రాంక్ష్‌కు ఈ టోర్నీలో ఇది రెండో స్వర్ణం.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలోనూ రుద్రాంక్ష్ బంగారు పతకం నెగ్గాడు. ప్రస్తుతం పట్టికలో భారత్ 5 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యలతో తన రెండో స్థానంలో కొనసాగుతున్నది.
విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ సిల్వర్ నెగ్గింది. ఫైనల్లో పాలక్, రిథమ్ సాంగ్వాన్, యువికా తోమర్‌తో కూడిన టీమ్ 8–16తో చైనా చేతిలో ఓడిపోయింది. విమెన్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో మేఘన, మెహులీ ఘోష్, ఎలవెనిల్‌తో కూడిన ఇండియా 17–11తో జర్మనీని ఓడించి బ్రాంజ్ గెలిచింది.
25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ జూనియర్ ఈవెంట్‌లో మాన్వి జైన్–సమీర్ జంట సిల్వర్ రాబట్టగా, పాయల్ ఖత్రి–సాహిల్ దుదానె ద్వయం బ్రాంజ్ నెగ్గింది.