మాములుగా క్రికెటర్లకు సినిమా యాక్టర్లు లవ్ లో పడటం కామన్. తాజాగా మరోసారి టీం ఇండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో కేఎల్ రాహుల్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. క్లోజ్ గా దిగిన ఈ ఇద్దరి ఫోటోను చుసిన నెటిజన్లు ఈ ఇద్దరిమధ్య ఏదో నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
థాయ్ ల్యాండ్ బీచ్ కు వెళ్లినట్టు సోషల్ మీడియా కోడైకూస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్రికెటర్ రాహుల్ పై ఇలాంటి వార్తలు రావటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ యంగ్ క్రికెటర్ కొంత మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.