అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 2021లో పెరిగింది. గతేడాది ఈ సంఖ్య 12 శాతం పెరిగినట్టు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. ఆశ్చర్యకరంగా అమెరికాలో అత్యధికంగా ఉండే చైనా విద్యార్థుల సంఖ్య గతేడాది పడిపోయినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇది 8శాతం కన్నా ఎక్కువగా పడిపోయినట్టు పేర్కొన్నాయి.
అంతర్జాతీయంగా 2021లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ పై కరోనా పాండెమిక్ ప్రభావం చూపిందని యూఎస్ పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల విభాగం తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఎఫ్ 1, ఎమ్ 1( నాన్ ఇమ్మిగ్రెంట్) వీసాల కింద విద్యార్థుల సంఖ్య 2021లో 1,236,748గా ఉన్నట్టు స్టూడెంట్స్ అండ్ ఎక్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 1.2 శాతం తగ్గినట్టు చెప్పింది.
2020తో పోలిస్తే గతేడాది చైనా నుంచి తక్కువ సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వచ్చారు. భారత్ నుంచి 2021లో 25,391 వచ్చినట్టు డేటా వెల్లడించింది. భారత విద్యార్థుల్లో 37 శాతం మంది విద్యార్థినులు ఉన్నట్టు చెప్పింది.