బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టు ఆడనున్న ప్లేయింగ్ ఎలెవన్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆడిలైడ్‌లో గురువారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా రంగంలోకి దిగనుండగా… ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగనుంది.
స్పినర్‌గా సీనియర్ బౌలర్ అశ్విన్‌కు అవకాశం ఇవ్వగా… వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని.. సీనియర్ వృద్ధిమాన్ సాహాకే అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా రహానే వ్యవహరించనున్నాడు.
టీమిండియా స్క్వాడ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్ర అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నవదీప్ షైనీ, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా