దేశంలో కరోనా కేసులు సగటున 40 వేల మార్క్ కిందకు దిగి రావడం లేదు. వారానికోసారి 30 వేలల్లో నమోదవుతున్నా.. నిత్యం 40 వేల పైనే ఉంటున్నాయి. ఇవాళ కూడా అదే పరంపర కొనసాగింది. గడిచిన 24 గంటల్లో 44 వేల 376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 92 లక్షల మార్క్ దాటాయి. కరోనా కారణంగా నిన్న 481 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు లక్షా 34 వేల 699కు పెరిగాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 92.22 లక్షలకు చేరాయి. కరోనా బారి నుంచి నిన్న 37 వేల 816 మంది రికవరీ అయ్యారు. ఇందులో ఇప్పటికే 86.42 వేల లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఇంకా 4.44 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.