లఢఖ్ లో ఏర్పడ్డ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇండియా-చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఎవరికి వారు ముందుచూపుతో వ్యవహరిస్తూ, యుద్ధ సన్నాహలు మొదలుపెట్టారు. తాజాగా చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్న ఆలోచనతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డ్రాగన్ నిఘా వ్యవస్థ కళ్లు కప్పి దక్షిణ చైనా సముద్ర జలాల్లో భారత్ తన యుద్ధ నౌకను ప్రవేశపెట్టింది.
దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు మొహరించి ఉండగా, ఇప్పుడు భారత్ కూడా ప్రవేశించింది. ఈ నౌక ద్వారా చైనా ఆర్మీ అడుగులపై నిఘా పెట్టడం భారత్ కు మరింత హిజీ కానుంది. చైనాతో ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే… మరోవైపు మూడో కంటికి తెలియకుండా యుద్ధ నౌకను చైనా పెత్తనం సాగే సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఈ చర్య ద్వారా చైనా షాక్ కు గురైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ప్రభావం చైనా నౌకాదళం, లిబరేషన్ ఆర్మీపై గట్టి ప్రభావాన్నే చూపుతుందని అభిప్రాయపడింది.
ఇక చైనా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత్ తన నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. హిందూ మహా సముద్రంలో భారత్ ఇప్పటికే భారీగా యుద్ధ నౌకలను మొహరించింది.