కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలవాలన్న భారత హాకీ మహిళా జట్టుకు తీవ్ర అసంతృప్తి ఎదురైంది. మంచి ఊపు మీద ఉన్న భారత మహిళా హాకీ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది.
మొదట మ్యాచ్ 1-1తో టై అయింది. దీంతో పెనాల్టీ షూటౌట్ ను నిర్వహించారు. షూటౌటో లో భారత్ 3-0 తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణులు కైటిలిన్ నాబ్స్, అమీ లావ్టన్ గోల్ కొట్టగా.. భారత క్రీడాకారిణులు నవనత్ కౌర్, నేహా గోల్ కొట్టడంలో విఫలమయ్యారు.
ఇక భారత జట్టు కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ తీరుపై వ్యతిరేకత వచ్చింది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
షూటౌట్ మొదలయ్యాక ఆస్ట్రేలియా క్రీడాకారిణి అంబ్రోషియా మాలోన్ కొట్టిన గోల్‌ను ఇడియా గోల్‌కీపర్ సవితా పూనియా సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే అప్పటికి తాను గడియారం సెట్ చేయలేదంటూ అంబ్రోషియాకు మహిళా అంపైర్ తెలిపారు. ఈ మేరకు అంబ్రోషియాకు మరో అవకాశం ఇచ్చారు.
ఈ క్రమంలో అంపైర్ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షూటౌట్ నిర్వహణలో లోపాల కారణంగానే భారత్ స్వర్ణాన్ని కోల్పోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. అసీస్ ఆటగాళ్లకు అంపైర్ అనుకూలంగా వ్యవహరించారని, అందువల్లే ఆసీస్ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియలో మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు.