ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లాలంటే ఎన్నో నిబందనలు ఉంటాయి. కానీ.. ఇప్పుడు ఇండియా పాస్ పోర్టు సామర్థ్యం మెరుగైంది. 2021 సంవత్సరంతో పోలిస్తే తాజా క్వార్టర్ లో ఇండియా పాస్ పోర్టు సామర్థ్యం మరింత మెరుగుపడింది. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో గతేడాది ర్యాంకింగ్స్ లో ఇండియా 90వ స్థానం నుంచి 83వ ర్యాంక్ కు సాధించింది.
దీంతో భారత పాస్ పోర్టు హోల్డర్లు ఒమన్, అర్మీనియా సహా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు వీసా లేకుండా భారతీయులు వెళ్లవచ్చుని అధికారులు ప్రకటన చేశారు. అయితే భారత్ 2006 నుంచి 35 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ ట్రావెల్ కు అర్హత సాధించింది. 2006లో ఓ వ్యక్తి సగటును 57 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఆ సంఖ్యను 107 దేశాలకు పెరిగిందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
స్వీడన్, అమెరికా వంటి దేశాల జాతీయులు 180 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణం సాగిస్తుంది. అంగోలా, కామెరూన్, లావోస్ పాస్ పోర్టులు కలిగిన వారు కేవలం 50 దేశాలకు వీసా లేకుండా వెళ్లగల్గుతున్నారని తెలిపింది. 2022 తొలి క్వార్టర్ కు గానూ ప్రకటించిన ప్రస్తుత ర్యాంకింగ్స్ లో ఇండియా సాటోం, ప్రన్సిప్ లతో కలిపి 83వ ర్యాంక్ ను షేర్ చేసుకుంటున్నాయి. ఉగాండా దేశాల తర్వాతి స్థానంలో ఇండియా నిలవడం గమనార్హం అధికారులు పేర్కొంటున్నారు.