హైదరాబాద్‌కు కొత్తగా ఎవరొచ్చినా… బయటకు లంచ్ లేదా డిన్నర్‌కు వెళ్లినా… ఫ్రెండ్స్ ఏ ఇద్దరు బయటకు వెళ్లినా … వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ. అందుకే హైదారబాద్ బిర్యానీ ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే… ఎలా ఆఫర్లతో బిర్యానీపై పోటీ పడతాయో అందిరికీ తెలుసు.
ఇండియాలో ఫేవరేట్ డిష్‌గా మారిపోయిన చికెన్ బిర్యానీ.. తన రికార్డును కాపాడుకుంది. 2019లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌కు సంబంధించి స్విగ్గీ విడుదల చేసిన రిపోర్ట్‌లో ఒక నిమిషానికి దేశవ్యాప్తంగా 95 బిర్యానీలు ఆర్డర్ వస్తుందని తెలిపింది. అంటే ప్రతి సెకన్‌కు దాదాపు రెండు బిర్యానీల ఆర్డర్ వస్తుందన్న మాట. ఈ సంవత్సరం జనవరి నుండి అక్టోబర్ వరకు తీసిన డేటా ఆధారంగా ఫుడ్‌లో బిర్యానీ టాప్‌లో ఉంటే… స్వీట్స్‌లో గులాబ్‌జామూన్ టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఇక మసాల దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీలు తర్వాతి ప్లేస్‌ను దక్కించుకున్నాయి.
నెలరోజుల్లో పెళ్లి..ట్రైన్ రూపంలో మృత్యువు
ఇక ఈ సంవత్సరం కొచ్చికి చెందిన సుధ అనే ఆమె రికార్డు స్థాయిలో ఫుడ్ సప్లై చేసినట్లు స్విగ్గీ ప్రకటించింది. దాదాపు 2500కు పైగా ఆర్డర్స్‌ను ఆమె సప్లై చేసినట్లు తెలిపింది.
ఇక స్వీట్స్ విషయానికి వస్తే… గులాబ్ జామూన్ తర్వాత ఫలూదాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయట. ఎక్కువగా ముంబైలో ఫలూదా ఆర్డర్స్ వచ్చాయని… ఆ తర్వాత చాకో డ్రింక్స్, కేక్స్ ఆర్డర్స్ వచ్చినట్లు సంస్థ ప్రకటించింది.
క్రిస్మస్ ముందే ఎందుకు స్టార్‌ను వేలాడదీస్తారు…?
అయితే, చిన్న పట్టణాలకు తాము విస్తరించిన వారంలోపే… ఆర్డర్స్ గణనీయంగా పెరిగాయని, అందుకు ఉదాహరణగా గుంటూరు, వరంగల్ పట్టణాలను పేర్కొంది.
దీన్ని బట్టి చూస్తే… బిర్యానీ లవర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది.