కరోనా వైరస్ కష్టకాలంలో తిరిగి స్వదేశానికి రావాలనుకుంటున్న వారి కోసం కేంద్రం ప్రారంభించిన వందే భారత్ మిషన్ లో భాగంగా కువైట్ నుండి ప్రత్యేక విమానం హైదరాబాద్ చేరుకుంది. 163మంది ప్రయాణికులతో శనివారం రాత్రి 10.30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా… అక్కడ మరోసారి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి వారందరిని అధికారులు క్వారెంటైన్ కు తరలించారు.
కువైట్ నుండి వచ్చిన వారికి రాష్ట్రంలోని పలు హోటళ్లలో క్వారెంటైన్ సెంటర్లు ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ప్రయాణికుడి ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లు మూడు రకాలుగా ఉన్నాయి. 30వేలు, 15వేలతో ఉండగా… డబ్బు చెల్లించే స్థితిలో లేని వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని క్వారెంటైన్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మొత్తం 14 రోజుల పాటు వీరంతా క్వారెంటైన్ సెంటర్లలో ఉండబోతున్నారు. వీరికి ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు.
వీరి కోసం హోటళ్లను ముందుగానే శానిటైజ్ చేసి పెట్టారు అధికారులు.