స్వీడన్ రాజ దంపతులపై భారత్ లో ప్రశంసలు - Tolivelugu

స్వీడన్ రాజ దంపతులపై భారత్ లో ప్రశంసలు

, స్వీడన్ రాజ దంపతులపై భారత్ లో ప్రశంసలు

అయిదు రోజుల భారత పర్యటనకొచ్చిన స్వీడన్ రాజ దంపతులు ఈరోజు ఉదయం స్టాక్ హోమ్- ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అయిదు రోజుల పర్యటనలో రాజ దంపతులు రాష్ట్రపతితో భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించనున్నారు. కింగ్ కార్ల్-16 గుస్టాప్, క్వీన్ సిల్వియా ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన కొన్ని గంటల్లోనే వందలాది మంది భారతీయుల ప్రేమాభిమానాలు పొందారు. సోషల్ మీడియాలో వారిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
అసలు విషయం ఏంటంటే..ఒక దేశానికి రాజు అయిన కింగ్ కార్ల్-16 గుస్టాప్ తనది, తన భార్య బ్యాగ్ ల ను తానే పట్టుకుని నడిచారు. వారి ఆ ఫోటోను ఎయిరిండియా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.” ఎయిరిండియాలో ప్రత్యేక గెస్ట్ గా ప్రయాణించడం గర్వకారణం” అని ట్వీట్ చేసింది. కొన్ని గంటల్లోనే వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. భారత దేశానికి అధికారిక పర్యటనకు వచ్చిన ఆ రాజదంపతుల నిరాండబరతను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రత్యేక విమానంలో కాకుండా…ఎయిరిండియా విమానంలో రావడమే అతని నిరాంబరతకు చిహ్నమంటున్నారు. ఎకానమీ తగ్గుముఖం పట్టిన ఈ పరిస్థితుల్లో మన నేతలు కూడా విదేశీ పర్యటనలకు ఇలా వెళ్లలేరా..? హంగూ ఆర్భాటం..మంది మార్బలం లేకుండా.. అని ప్రశ్నిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp