టెక్నాలజీ అంటే ఇండియన్స్ కు ఎంతో ఇష్టం…అలాగే డిజిటల్ అసిస్టెంట్ అలెక్సా అంటే అంతకన్నా ఇష్టం..అది ఇండియన్సే స్వయంగా ఒప్పుకుంటారు.
2019 లో ఇండియన్ కస్టమర్లు కొన్ని లక్షల సార్లు అలెక్సాతో ఇంటరాక్ట్ అయ్యారు. అత్యధికంగా ఇండియన్స్ చెప్పిందేంటంటే ”అలెక్సా..ఐ లవ్ యు” ప్రతి నిమిషానికొకసారి ఎవరో ఒక ఇండియన్ ఈ మాట చెప్పారు. ఆ తర్వాత ” అలెక్సా, విల్ యు మ్యారీ మి” ప్రతి రెండో నిమిషానికి ఒక్కరైనా అడిగే ప్రశ్న.
ఇవే కాదు…ఇండియన్ కస్టమర్లు అలెక్షాను అత్యధికంగా అడిగిన ప్రశ్నల్లో మరొకటి ”హౌ ఆర్ యు” నిమిషానికి 8 సార్లు ఈ ప్రశ్నను అడిగారు. అలాగే ”అలెక్సా, కైసీ హో..? ఈ ప్రశ్నను నిమిషానికి మూడు సార్లు అడిగారు. ఇదిలా వుంటే అలెక్సాలో అత్యధిక డిమాండ్ ఉన్న వాటిలో మ్యూజిక్. తమకు ఇష్టమైన పాటల కోసం నిమిషానికి 1000 మంది అలెక్సాను కోరుతారు.