-తాజాగా 841 కొవిడ్ కేసుల
-129 రోజుల తర్వాత తొలిసారి అధిక కేసులు
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా దేశంలో 800కు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత ఈ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం….
దేశంలో కొత్తగా 841 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349కి చేరుకుంది. కరోనా బారిన పడి జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దేశంలో ఇప్పటి వరకు 4,41,58,161 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 220.64 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆరు రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్‌పైన దృష్టి పెట్టాలని సూచనలు చేసింది.