బీజేవైఎం నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశానికి టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ హాజరు కానున్నారు. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగే బీజేవైఎం వర్కింగ్ కమిటీ సెషన్ కు ఆయన హాజరవుతారు.
ఈ విషయాన్ని ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నహేరియా వెల్లడించారు. యువత తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరనే సందేశాన్ని యువతకు రాహుల్ ద్రావిడ్ ఇస్తారని ఆయన తెలిపారు.
‘ బీజేవైఎం నేషనల్ వర్కింగ్ కమిటీని మే 12-15 వరకు నిర్వహిస్తున్నాము. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు’ అని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా మరోసారి అధికారాన్ని చేజిక్కిచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ వస్తుండటం గమనార్హం.