భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గత నెల 26న పంపిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్ శాట్)-6 పని చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఇస్రో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఉపగ్రహం మొదటి రోజులు కొన్ని ఫోటోలను తీసి ట్విట్టర్‌లో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి పంపింది.
ఈ శాటిలైట్ తీసిన ఫోటోలు హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చేరాయి. ఆరేబియా సముద్రం, గుజరాత్‌లోకి కచ్ సహా హిమాలయ ప్రాంతాన్ని ఈవోఎస్ శాట్-6 ఫోటోలు తీసి పంపింది.
ఓషన్ కలర్ మానిటర్ (ఓసీఎమ్) సీ సర్ఫేస్ టెంపరేచర్ మానిటర్ (ఎస్ఎస్టీఎమ్) సెన్సార్‌ల ద్వారా ఈవోఎస్ శాట్-6 ఈ ఫోటోలను తీసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ శాటిలైట్ పంపిన ఫోటోలను ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆన్ లైన్‌లో విడుదల చేశారు.
ఈ ఓషన్‌శాట్ ఉపగ్రహాల ద్వారా భూమి వాతావరణాన్ని నిశితంగా పరిశీలించడం, తుఫానులను ముందస్తుగా పసిగట్టడం, వాతావరణంలో తేమ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేస్తారు. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం.. మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను వంటి వాటిని గుర్తించేందుకు దోహదపడుతుంది.
గత నెలలో ఇస్రో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ విక్రమ్ – Sను ఇస్రో నింగిలోకి పంపింది. అలాగే, గగన్‌యాన్ ప్రయోగం కోసం కూడా వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చే మాడ్యూల్‌ను కూడా నిర్వహించి విజయం సాధించింది.