దేశంలో పూటకో ఛానల్, రోజుకో పేపర్ పుట్టుకొస్తుంది. ఇక యూట్యూబ్, వెబ్ సైట్స్ గురించి లెక్కే లేదు. ఇలాంటి తరుణంలో ఇండియాలో అత్యంత నమ్మకమైన వార్తా సంస్థలుగా ఎవరికి పేరుంది అని అంతర్జాతీయ ప్రముఖ న్యూస్ ఎజెన్సీ రాయిటర్స్, ఆక్స్ ఫర్డ్ నిపుణుల బృందం పరిశీలన చేసింది.
2021 మే-జూన్ లో మొదలైన ఈ సర్వే రిపోర్టును ఇటీవలే రాయిటర్స్ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం డీడీ న్యూస్, టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థలకు అత్యంత ప్రజాదరణతో పాటు నమ్మకమైన సంస్థలుగా గుర్తింపు దక్కినట్లు తేల్చింది. డీడీ న్యూస్ ను 46శాతం, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ను 42శాతం ప్రజలు మెచ్చుకున్నారు. ఇక ఉన్న వాటిలో ఇవే బెటర్ అన్నట్లుగా ఈ రెండు సంస్థలకే అత్యధికంగా జనం మొగ్గుచూపారు.
దేశవ్యాప్తంగా సర్వే జరగ్గా ఎక్కువగా మహారాష్ట్రలో 16.72శాంపిల్స్, ఢిల్లీలో 12.41శాతం శాంపిల్స్ ను సేకరించారు. మొత్తం మందిలో దాదాపు 88శాతం మంది డీడీ న్యూస్ వైపే మొగ్గుచూపారు. 81శాతం టైమ్స్ గ్రూప్ కు ఓటేశారు. రాయిటర్స్ ఇచ్చిన లిస్టులో ఆల్ ఇండియా రేడియోతో పాటు ఎన్డీటీవీ, జీ న్యూస్, హిందూస్థాన్ టైమ్స్, రిపబ్లిక్, ది హిందూ కూడా ఉన్నాయి. మొత్తం 15 సంస్థలను లిస్టులో మెన్షన్ చేశారు.