ఇండిగో సంస్థ సహ స్థాపకుడు రాకేశ్ గాంగ్వాల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్ పూర్ కు భారీగా విరాళాన్ని ఆయన అందజేశారు.
1975లో ఐఐటీ ఖరగ్ పూర్ లో ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తాజాగా ఐఐటీ ఖరగ్ పూర్ లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు గాను తన వంతుగా రూ. 100 కోట్ల విరాళాన్ని అందజేశారు.
ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ లో మెడికల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించారు. ఇందులో మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు.
దీనికి భారీగా డబ్బు కావాల్సి వస్తుందని అధికారులు అంచనావేశారు. ఈ క్రమంలో కళాశాల నిర్మాణానికి తన వంతుగా రూ. 100 కోట్లలను విరాళంగా అందజేశారు. దీనిపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.