శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు బయల్దేరిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
విశాఖలో దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతి నిరాకరించారు.
కాగా గత కొన్ని రోజులుగా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. రన్ వే కూడా పూర్తిగా కనిపించకపోవడం తో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.