థాయ్‌లాండ్ వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఇండిగో 6ఇ-1763 విమానం ఈ రోజు ఉదయం 6:41కి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు బయలు దేరింది.
విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యలను గుర్తించారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. ఉదయం 7:31గంటలకు ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్టు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత ఇండిగో పైలట్ ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ కోసం ఏటీసీని సంప్రదించారని ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. దీంతో ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించినట్టు చెప్పారు. అనంతరం ఫ్లైట్ ఎయిర్ పోర్టులో దిగినట్టు వెల్లడించారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తన్నట్టు ఇండిగో ప్రకటనలో పేర్కొంది. విమానంలోని ప్రయాణికులందరినీ దించి వేరే విమానంలో థాయ్ లాండ్‌కు పంపించినట్టు చెప్పింది. విమానంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియలేదు.