ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని పైలట్స్ అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేశారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్స్ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించాలని సంబంధిత అధికారులను కోరారు. దీంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు.
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ ప్రకటించింది. వారి కోసం కరాచీకి మరో విమానాన్ని పంపించింది. ఈ విమానం ఆదివారం ఉదయం షార్జా నుంచి హైదరాబాద్ బయల్దేరింది. భారత ఫ్లైట్ ఇలా రెండు వారాల వ్యవధిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి.
జులై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని హడావుడిగా కరాచీకి మళ్లించారు. అప్పుడు ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదు. ఇప్పుడు ఇండిగో విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.