ఇందిరా శోభన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అభయహస్తం కో కాంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్-2009 కింద తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళా సభ్యులున్నారు. ప్రతి సభ్యురాలు రోజుకు ఒక రూపాయి చొప్పున బ్యాంకులో జమ చేస్తే.. ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేసింది. 2009 నుంచి 2020 మార్చి వరకు ప్రభుత్వం దగ్గర.. కో కాంట్రిబ్యూటరీ పెన్షన యాక్ట్ ప్రీమియమ్ కింద ఉన్న మొత్తం రూ.934 కోట్లు. ఆర్టీఐ కింద తాజాగా మేము తీసుకున్న సమాచారం ప్రకారం.. అభయహస్తం పథకం అసలు అమల్లోనే లేదని యాక్ట్ నెం.6 ఆఫ్ 2020.. మార్చి 21, 2020న రద్దు చేశామని అందులో తెలిపారు. ప్రభుత్వం ఇలా అకస్మాత్తుగా అభయహస్తం పథకాన్ని రద్దు చేయడం వల్ల ప్రతి సభ్యురాలు తన పింఛన్ హక్కును, ఇన్సూరెన్స్, తమ పిల్లలకు విద్యాపరంగా రావల్సిన స్కాలర్ షిప్పులను కోల్పోవడం జరిగింది. అంతేకాదు.. ఆ సభ్యులు జమ చేసుకున్న మొత్తాన్ని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి వారికి చెల్లించలేదు.
ఈ స్కీమ్ రద్దు చేసి 10 నెలలు దాటినా వారికి రావల్సిన వడ్డీ మొత్తాన్ని కూడా చెల్లించలేదు. మహిళా సభ్యులు జమ చేసిన మొత్తం రూ.934 కోట్లు ఎల్ఐసీ వాళ్ల దగ్గర ఉన్నట్లు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చారు. దయచేసి.. రంగారెడ్డి జిల్లా పరిధిలో అభయహస్తం పథకం కింద ఉన్న సభ్యురాలులందరికీ ప్రీమియం మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లింపజేయగలరని మనవి. అంతే కాకుండా2009 నుండి 2020 వరకు చనిపోయిన అభయ హస్తం సభ్యులకు ఇన్సూరెన్స్ పూర్తి పరిష్కారం ఇప్పించాలని కోరుతున్నాం. దీంతో పాటు.. రంగారెడ్డి జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కింద వడ్డీ లేని రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం రూ.320 కోట్లు. దయచేసి మీరు చొరవ చూపి ఆ మొత్తాన్ని కూడా చెల్లింపజేయగలరని మనవి.