రాజన్న రాజ్యం అంటూ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు ఆదిలోనే షాక్ తగిలింది. వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పార్టీకి రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు పంపారామె. దీనిపై వివరాలు తెలుసుకునేందుకు తొలివెలుగు ఇందిరా శోభన్ ను సంప్రదించగా నిజమేనని చెప్పారు.
వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేశానని.. ఇప్పటిదాకా తనను ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని అన్నారు ఇందిరా శోభన్.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వచ్చాక కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందిరా శోభన్ మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్తారని ప్రచారం జరుగుతోంది.