– పది నెలలు కాపురం
– షాకింగ్ న్యూస్ తెలుసుకున్న యువతి
– తాను పెళ్లి చేసుకుంది అబ్బాయి కాదు అమ్మాయే
ఇండోనేషియాలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లయిన పది నెలల తర్వాత తన భర్త పురుషుడు కాదు.. స్త్రీ అని గుర్తించి దిగ్భ్రాంతికి గురైంది. 22 ఏళ్ల ఆ యువతి తన ‘భర్త’ను గతేడాది ఓ డేటింగ్ యాప్ లో పరిచయం చేసుకుంది. అది కాస్తా ప్రేమగా మారింది.
తాను అమెరికాలో శిక్షణ పొందిన వైద్యుడ్ని అని.. తనకు వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో నమ్మేసింది ఆ యువతి. కొంతకాలం ప్రేమాయణం నడిచింది. ఆ ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. కొంతకాలం తర్వాత ఇరువురు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
ప్రభుత్వానికి సమర్పించాల్సిన పత్రాలు ‘అతడి’ వద్ద లేకపోవడంతో రహస్యంగా ఒక్కటయ్యారు. కొత్త దంపతులు ఇద్దరూ దక్షిణ సుమత్రా ప్రాంతంలో కాపురం పెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి ‘భర్త’ తరచుగా కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడంతో ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది.
సదరు యువతి ఆమె కుటుంబం నుంచి దాదాపు రూ.15లక్షలను తన భర్త కుటుంబానికి ఇచ్చింది. అయినప్పటికీ భర్త వేదింపులు ఆగలేదు. దీంతో విసుగు చెందిన మహిళ భర్తనుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సదరు మహిళకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
తాను వివాహం చేసుకుంది అబ్బాయిని కాదని.. ఓ అమ్మాయిని అని తెలియడంతో షాక్ కు గురైంది. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి.. వెంటనే తన కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేసింది. కుటుంబ సభ్యుల సలహాతో జాంబి జిల్లా కోర్టులో పిర్యాదు దాఖలు చేసింది యువతి. దీంతో ఈ కేసును కోర్టు విచారణ చేపట్టింది.