దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన ఇండోర్ సిటీకి భారీ క్రెడిట్ దక్కింది. మధ్యప్రదేశ్ లోని ఈ నగర మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ బాండ్లు సుమారు రూ. 720 కోట్లను సమీకరించగా నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి 5.90 సార్లు ఓవర్ సబ్ స్క్రయిబయింది. . బాండ్ల దరఖాస్తుకు మంగళవారమే చివరి రోజు.. సబ్ స్క్రిప్షన్ కి ఇష్యూని ఈ నెల 14 నుంచి 14 వరకు ఓపెన్ చేశారు.
ఈ బాండ్ల అమ్మకం ద్వారా దాదాపు 244 కోట్లను సమీకరించి ఆ నిధులతో రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో సమ్రాజ్, అశుఖేడి గ్రామాల్లో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. నర్మదా నది నుంచి నీటిని పంప్ చేసి సప్లయ్ చేయడానికి ఇది ఓ పెద్ద సోలార్ ప్లాంట్ కాగలదని భావిస్తున్నారు.
ఫైనాన్స్, లేదా రీఫైనాన్స్ చేసేందుకు పబ్లిక్ లేక ప్రయివేట్ సంస్థలు జారీ చేసే డెట్ సెక్యూరిటీలే గ్రీన్ బాండ్లు.. ఈ ప్రాజెక్టులు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. టెరిటరీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు యూపీలోని ఘజియాబాద్ నగర్ నిగమ్ సంస్థ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ మున్సిపల్ బాండును జారీ చేసింది.
సోలార్ పవర్ ప్రాజెక్టులకు నిధులు ఎంతయినా అవసరమని, రానున్న కాలంలో మరిన్ని గ్రీన్ ప్రాజెక్టులకు ఇది మార్గాన్ని సుగమం చేస్తుందని ఐఎంసి కమిషనర్ ప్రతిభా పాల్ చెప్పారు. 2018 లో ఇండోర్ నగరం నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ డెట్ సెక్యూరిటీస్ ప్లాట్ ఫామ్ లో మున్సిపల్ బాండ్లను లిస్ట్ చేసే తొలి నగరంగా పాపులర్ అయిందన్నారు. ఈ సిటీ వరుసగా ఆరోసారి కూడా పరిశుభ్ర నగరంగా ఎంపికయింది. స్వచ్ఛతా క్యాంపెయిన్ సక్సెస్ తో ఈ నగర మున్సిపల్ కార్పొరేషన్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందని ప్రతిభా పాల్ తెలిపారు.