అనంతపురము: ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర సర్వీస్ బస్సు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. మరో 14 మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో హైవేపై ఈ బస్సు లారీని ఢీకొట్టింది. గాయపడిన ప్రయాణీకులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇంద్ర బస్సు నంద్యాల నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.