నల్లు ఇంద్రసేన రెడ్డి,
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఫూల్ చేస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో ఎలాంటి సిట్ ప్రభుత్వం వేయలేదు. విచారణ పెండింగ్ లో పెట్టేందుకు సిట్ పేరుతో హడావుడి చేస్తున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు ఆగిపోయింది. డేటా చోరీ, నోటుకు ఓటు కేసులన్నీ ఏమయ్యాయో తెలుసు.
ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణ ఏసీబీ అవినీతి నిరోధక కేసులను చేదించలేకపోవడంలో ముందంజలో ఉంది.టీఎస్పీఎస్సీ కి నిబంధనలు ఉన్నాయి. 164( D ) నిబంధనల ప్రకారం పేపర్ ఉంచే సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడానికి ఎవరికి అనుమతి ఉండదు. కాన్ఫిడేక్షన్ సెక్షన్ లోకి చైర్మన్ కూడా వెళ్లడానికి రూల్ లేదు.
పేపర్ లు బయటకు ఎట్లా వచ్చాయి..? టీఎస్పీఎస్సీ లో ఇంత అవకతవకలు జరిగిన రాష్ట్రపతికి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయలేదు. టీఎస్సీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం సిట్ ను నియమించలేదు.. అది కేవలం పోలీస్ కేసు మాత్రమే.టీఎస్పీఎస్సీ లో న్యాయం జరగాలంటే రాష్ట్రపతికి అప్పగించాలి. అప్పుడే ఎవరెవరు ఉన్నారనేది తెలుస్తోంది.ప్రస్తుత బోర్డ్ ను రద్దు చేసి, కొత్త బోర్డ్ ను నియమించి ఎగ్జాం లను నిర్వహించాలి.