కరోనా వ్యాక్సిన్, కరోనా వైరస్ ఏర్పరిచిన నష్టంపై ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఇప్పటికిప్పుడు రోజుకు కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వటం ప్రారంభించినా, దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే 140 రోజులు పడుతుందన్నారు. కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో మరిన్ని ఏర్పాట్లు చేయాలని, టైర్-2,3 సిటీస్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూయేషన్ లో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన… దేశంలో జీడీపీ వృద్ధి 1947నాటికి పడిపోయే ప్రమాదం ఉందని, మైనస్ లోకి పోయినా ఆశ్చర్యమేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడాలంటే సొంతూర్లకు వెళ్లిపోయిన 140మిలియన్ల జనాభా తిరిగి పనులకు చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితును బట్టి కొత్త వ్యవస్థల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.